MEDICAL INVALIDATION TO THE EMPLOYEE


''MEDICAL INVALIDATION RULES''

🌷 మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు🌷

Medical Invalidation


➽ అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి, ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర, దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.
(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)
(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)
(A.P Pension code volume-I,Article-441)

➽ తదుపరి ఒక కేసులో రాష్ట్ర ఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దు పరచింది.

➽ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుమేరకుప్రభుత్వం మరలా మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.
(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)

➽ ఎవరు అర్హులు:

➽ కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.

➽ భార్య/భర్త, కుమారులు, కూతుళ్ళు , చట్టరీత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకుని యుండాలి.
➽ అవివాహిత కూతురు, విధవరాలైన కూతురు, విడాకులు పొందిన కూతురు.*

➽ మెడికల్ ఇన్వాలిడేషన్ కోరకు  ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

➽  సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సుల నిమిత్తం పంపబడుతుంది.
➽  జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.
(G.O.Ms.No.35 తేది:10-04-2000)

➽ Medical Invalidation పై ఉద్యోగి రిటైరైన తేది నుంచి ఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

➽ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములు Employment కార్యాలయానికి తెలియజేయాలి.

➽ Medical Board నివేదిక అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.

District Level Committee:


1. జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు(CHAIRMAN)
2. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు
3. సంబంధిత జిల్లా శాఖ అధికారి- సభ్యుడు/కన్వీనర్

➽ శాఖధిపతి (Head of the Department) కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖలలో పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది

➽ Medical Invalidation పథకం క్రింద, కారుణ్య నియామకాలు, యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.

➽ భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.

➽ Medical Invalidation స్కీము జిల్లాపరిషత్, మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు.

➽ మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణాలపై) వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి Pension , Commutation అవకాశములేదు.

➽ మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు

➽ ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చును.?
➽ క్రింద తెలిపిన ఏదేని జబ్బులు రోగ పీడితులుగా ఉన్న ఉద్యోగి Medical Invalidation పై మెడికల్ బోర్డు నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.

1. పక్షవాతము(PARALYSIS):

A) నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు
B) ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము
C) క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు

అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము - (END STAGE RENAL DISEASE)

అంతిమదశలో ఉన్న కాలేయ రోగము - (END STAGE LEVER DISEASE)

క్యాన్సరు - (CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)

మానసిక సంబంధితము - (DEMENTIA-MENTAL DISORDER)

తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు - (SEVERE PARKINSON DISEASE)

➽ Medical Invalidation  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు

GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009 ప్రకారం - 

1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:
2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:
3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగా ఉన్నాయా:
4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:
5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:
6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:
7.రోగ వివరములు:
8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:
9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి   రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:
10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు  (ORIGINAL) సిఫార్సు జతపరిచారా:
11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు

Post a Comment

0 Comments